Janavaradhi | Online News


మాటిచ్చాక వెనక్కు తగ్గేది లేదు: సీఎం జగన్


వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అధికార పగ్గాలు చేపట్టక ఆ దిశగా అడుగులేస్తున్నారు. అక్టోబర్-1 నాటికి ఏపీలో ఎక్కడా బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గతంలో తానిచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకునేది లేదని స్పష్టం చేశారు సీఎం జగన్. కాగా తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్ వేదిక ఓ ట్వీట్ చేశారు. మద్య నిషేధం విషయంలో మాటిచ్చిన తాను, వెనక్కు తగ్గేది లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన జగన్, మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి" అని అన్నారు.
 

POLL