Janavaradhi | Online News


ఈవ్ టీజింగ్ చేస్తే సహించేది లేదు:ఎస్సై మౌనీష‌


సత్తెనపల్లి,జనవారధి: కళాశాలలో ఆడపిల్లలను వేధించినా,మానసికంగా ఇబ్బందులకు గురి చేసినా సహించేది లేదని,జీవితాలు పాడు చేసుకోవద్దని సత్తెనపల్లి రూరల్ ఎస్సై జి.మౌనీష అన్నారు.బుధవారం శాంతినికేతన్ కళాశాల నందు ప్రజ్వలన సేవా సంస్ధ ఆధ్వర్యంలో జరిగిన ఈవ్ టీజింగ్ నిర్మూలన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటుంది.గ్రామీణ ప్రాంతాలలోని ఆడపిల్లలు విద్య కోసం పట్టణానికి వస్తుంటారు.అలా మార్గ మధ్యలో గానీ , సామాజిక మాధ్యమాల్లో మిమ్మల్ని వేధించినా.. .ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్ లాంటి నేరాలకు పాల్పడితే వెంటనే మాకు సమాచారమివ్వండి.అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకుంటాం.మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె తెలిపారు.కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం,ప్రజ్వలన సేవా సంస్ధ బృందం ఈవ్ టీజింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి షీ టీమ్ సభ్యులు రమాదేవి,సౌజన్యలు పాల్గొన్నారు.





POLL