Janavaradhi | Online News


మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్...


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌కు గురయ్యారు. ఒక్కరోజు సభ నుంచి స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్‌, గణేష్‌కుమార్‌, రామకృష్ణ, వీరాంజనేయస్వామి సభకు ఆటంకం కలిగిస్తున్నారని సస్పెండ్ సస్పెండ్‌ చేశారు. మార్షల్‌ సాయంతో సస్పెండైన సభ్యులను బయటికి తరలించారు. ఇదిలా ఉంటే మైక్‌ అడిగితే ఇవ్వనందుకు నిరసనగా చంద్రబాబు సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇప్పటికే గతంలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు సస్పెండ్‌కు గురైన సంగతి తెలిసిందే.





POLL