Janavaradhi | Online News


సెల్‌ ఫోన్‌ రూపంలో శత్రువులు ఉన్నారు: హోంమంత్రి సుచరిత


శత్రువులు ఎక్కడో లేరు మన చేతుల్లో ఫోన్‌ల రూపంలో ఉన్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అంశంపై సచివాలయంలో జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేరాల పెరుగుదలకు కారణమవుతోందన్నారు. ఈ నేరాలకు ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు గురవుతున్నారని, ఫోన్ బాగుచేయించడానికి ఇస్తే దానిలో స్పై యాప్‌లు వేసి ఇస్తున్నారని సుచరిత తెలిపారు. మహిళలలో అవగాహన కల్పించి నేరాల బారిన పడకుండా ఉండేందుకు ఈ సదస్సు ఉపయోగ పడుతోందన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, తానేటి వనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

POLL