Janavaradhi | Online News


అమర వీరులకు ఘన నివాళి


 
సత్తెనపల్లి,జనవారధి:కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో వివేకానంద చైతన్య భారతి,ప్రగతి పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ప్రగతి విద్యాసంస్ధల ఆధ్వర్యంలో కార్గిల్ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు పెద్దినేని పోలయ్య పాల్గొని ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ కార్గిల్ అమరవీరుల త్యాగ నిరతిని కొనియాడారు.సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న ప్రాణ త్యాగాలను ఆయన విద్యార్ధులకు వివరి‍ంచారు.ప్రగతి విద్యాసంస్ధల కార్యదర్శి అండ్ కరస్పాండెంటెండ్ మక్కెన పద్మజ,ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసరావు,ఇంచార్జ్ ఎండి ఖాశిం తదితరులు పాల్గొన్నారు.
 
 
వివేకానంద చైతన్య భారతి ఆధ్వర్యంలో..
కార్గిల్ పోరాటంలో విజయం సాధించి నేటికి 20 సంవత్సరాలు పూర్తయిన‌ సందర్భంగా స్వామి వివేకానంద చైతన్య భారతి ఆధ్వర్యంలో  శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు కార్యక్రమం నిర్వహి‍ంచారు.ఈ సందర్భంగా పూర్వ సైనికులైన ఇందూరి వెంకటేశ్వ‌రరెడ్డి,బొల్లాపల్లి నాగేశ్వ‌రరావులను సత్కరించారు.  కార్గిల్ పోరాటలోమన దేశ సైనికుల సాహసోపేత విషయాలను సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీధర్,జెపిఎస్ శాస్త్రి,పూర్వ సైనికులు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు పిఎం రమేష్,అబ్బూరి సత్యనారాయణ,దేవరశెట్టి రవి,తొమ్మండ్రు సత్యనారాయణ,కుకుట్ల శ్రీనివాసరావు, లక్ష్మయ్య, యోగ సభ్యులు పాల్గొని కార్గిల్ పోరాట అమర వీరుల చిత్రపటాలకు పుష్పాంజలి సమర్పించి మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు.





POLL