Janavaradhi | Online News


గుంటూరుకు ఎక్స్ ప్రెస్ సర్వీసులు పెంచాలి


గుంటూరుకు ఎక్స్ ప్రెస్ సర్వీసులు పెంచాలి
సత్తెనపల్లి డిఎంకు వినతిపత్రం ఇచ్చిన ప్రజ్వలన బృందం
 
సత్తెనపల్లి, జనవారధి:ఏపియస్ ఆర్టీసి డిపో నుండి గుంటూరు,విజయవాడలకు ఎక్స్ ప్రెస్ సర్వీసులను ఏర్పాటు చేయాలని,తాలుకా సెంటర్లో బస్సుల సమయ పాలన పట్టికను తెలియజేయాలని ప్రజ్వలన సేవా సంస్ధ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ మంత్రూ నాయక్ కు వినతిపత్రం అందించారు.
 
ఈ సందర్భంగా ప్రజ్వలన బృందం మాట్లాడుతూ..సత్తెనపల్లి ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రయాణికులు గుంటూరుకు వెళ్తున్నారని,అయితే ప్రయాణికులకు సరిపడా సంఖ్యలో ఎక్స్ ప్రెస్ సర్వీసులు లేకపోవటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు.
 

 
పిడుగురాళ్ళ,మాచర్ల నుంచి వచ్చే బస్సులలోనూ ఖాళీలు లేకపోవటంతో గంటల తరబడి వేచిచూడతమే కాక గుంటూరు వరకు నిలబడి పోవాల్సివస్తుందని పేర్కొన్నారు.డిపో మేనేజర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్స్ ప్రెస్ సర్వీసులు పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 





POLL