Janavaradhi | Online News


ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: డిఎస్పీ


 

సత్తెనపల్లి,జనవారధి:ప్రతీ ఒక్కరూ ఈ వర్షాకాలంలో వీలైనన్ని మొక్కలను నాటి వాటిని సంరంక్షించాలని,వాటిద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని సత్తెనపల్లి డిఎస్పీ  విజయ భాస్కర రెడ్డి  అన్నారు.శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణ సిఐ విజయ చంద్ర,ఎస్సైలు క్రాంతి కుమార్,శివాంజనేయలు,ఫ్రాన్సిస్ లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలలో మరియు ఇంటి వద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. అడవుల వలనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అడవుల విస్తీర్ణం పెరగాలన్నా వాతావరణ సమతుల్యతను పాటించి భూతాపాన్ని తగ్గించాలన్న మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచించారు.కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది,తదితరులున్నారు.





POLL