Janavaradhi | Online News


ఒక భర్త - నలుగురు భార్యలు...


ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం నలుగురిని పెళ్లాడిన నిత్యపెళ్లికొడుకు పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. దుబాయ్‌లో ఉద్యోగం. చేతినిండా సంపాదన, చూడ్డానికి సినిమా స్టార్‌లా వేషధారణ, ముఖ కవళికలు. వరుడి వేటలో ఉన్న యువతికి ఇంతకంటే ఏమి కావాలి.  అందుకే ఒకరికితెలియకుండా మరొకరిని పెళ్లాలుగా చేసుకున్నాడు.  కోమలాదేవి అనే యువతిని మొదట పెళ్లాడాడు. ఇద్దరు బిడ్డలుకూడా ఉన్నారు.  పెళ్లికాగానే కోమలాదేవిని దుబాయ్‌కి తీసుకెళ్లి కొత్తగా ఒక సంస్థను నెలకొల్పి బాగా సంపాదించాడు.  కొన్నిరోజుల తరువాత  కోమలాదేవిని ఇండియాకు తీసుకొచ్చి రామనాథపురంలో వదిలిపెట్టాడు.అప్పుడప్పుడూ భార్య వద్దకు వచ్చేవాడు. ఇలా ఒకసారి రామనాథపురం వచ్చినపుడు గంగనాథన్‌ సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చింది. 
 
భర్త సెల్‌ఫోన్‌ నుంచి అ నంబరుకు కోమలాదేవీ ఫోన్‌ చేయగా గంగనాథన్‌కు చిన్నసేలంకు చెందిన కవిత అనే యువతితో రెండో వివాహమైందని, ఆమె గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని బిత్తరపోయింది. భర్తను నిలదీయగా కవిత ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. అయితే భర్త మాటలను నమ్మని కోమలాదేవి రహస్యంగా అతని సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి విచారణ జరిపి చెన్నైకి చెందిన యమున అనే యువతిని మూడో భార్యగా, దీప అనే మహిళను నాల్గో భార్యగా వివాహమాడినట్లు తెలుసుకుంది. ఒక్కో భార్యతో సన్నిహితంగా తీసుకున్న ఫొటోలు, శృంగార వాట్సాప్‌ మెసేజ్‌లు చూసి లోలోన ఆగ్రహంతో ఊగిపోయింది. కోమలాదేవి భర్తపై రామనాథపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. గంగనాథన్, కోమలాదేవీ దంపతులకు 10, 9 ఏళ్ల వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండోభార్య కవితకు శ్రీధరన్, మూడోభార్య యమునకు గిరిధరన్, నాల్గో భార్య దీపకు ఒక కుమార్తె ఉండడం గమనార్హం.





POLL