Janavaradhi | Online News


ప్రమాదమైనా పట్టించుకోరా..?


ప్రమాదమైనా పట్టించుకోరా..?
నేలకొరిగిన విద్యుత్ స్ధంభం
విద్యుత్తు అధికారులపై స్ధానికుల ఆగ్రహం
 

 
సత్తెనపల్లి,జనవారధి:పట్టణంలోని 16వ వార్డ్ శాస్త్రి నగర్ లో విద్యుత్ స్ధంభం పడిపోవడానికి సిద్ధంగా ఉందని, దీంతో ఎప్పుడు ఏప్రమాదం చోటుచేసుకుంటుందో తెలియక భయంగా ఉందని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న‌ విద్యుత్‌ స్ధంభం వంగి కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్ధితిని వివరిస్తున్నారు.
 
 
 
ప్రస్తుతం వర్షాలు, ఈదురుగాలులు బలంగా వీస్తున్న నేపథ్యంలో స్ధంభం పడిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. సిమెంట్‌ పోల్‌ వంగి తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని విద్యుత్‌ సిబ్బంది ప్రమాదాలు జరుగక ముందు చర్యలు తీసుకుని వాటిని బాగుచేయాలని స్ధానికులు కోరుతున్నారు. త‌క్ష‌ణం అధికారులు స్పందించి చ‌ర్య‌లు తీసుకోకుంటే ఏనాటికైనా ప్ర‌మాదం సంభ‌వించే ఆస్కారం లేక‌పోలేదు.





POLL