Janavaradhi | Online News


సిమెంట్ రోడ్డు వేయండి మహాప్రభో


సిమెంట్ రోడ్డు వేయండి మహాప్రభో
కమీషనర్ కు స్ధానికుల మొర‌
 
 

సత్తెనపల్లి,జనవారధి: పట్టణంలో కురుస్తున్న వర్షాలకు 16వ వార్డ్ శాస్త్రి నగర్ లోని మట్టి రోడ్లు  బురదమయమయ్యాయి. బురదలో దిగాలంటే ఎక్కడ కాలు జారి పడిపోతామో అన్న భయంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, నేతలు ఎందరొచ్చినా ఎవ్వరూ పట్టించుకోలేదు. 'ప్రభుత్వాలు మారిపోయినా... మా కాలనీ రోడ్డు మారట్లేదు' అంటూ కాలనీ వాసులంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలనీకి సిమెంట్‌ రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.





POLL