Janavaradhi | Online News


హైదరాబాద్: మెట్రోరైలుకు తప్పిన భారీ ప్రమాదం...


హైదరాబాద్ మెట్రోకు భారీ ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్‌ కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌.. అనుకోకుండా పక్క ట్రాక్‌లో ప్రయాణించింది. అయితే దీన్ని గమనించిన మెట్రో అధికారులు.. ట్రైన్‌ను లక్డీకాపూల్‌లో నిలిపేశారు. అక్కడే ట్రైన్‌ లో ఉన్న సుమారు 300 మంది ప్రయాణీకులను దింపేశారు. ఆ తర్వాత ట్రైన్‌ను వెనక్కు మళ్లించారు. ఆ సమయంలో ఎదురుగా వేరే ట్రైన్‌ రాకపోవడంతో.. భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ మెట్రో ట్రైన్ వ్యతిరేక దిశలో వెళ్లినప్పుడు ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. మొత్తానికి పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

POLL