Janavaradhi | Online News


అబ్దుల్ కలాంకు ఘన నివాళులు


అబ్దుల్ కలాంకు ఘన నివాళులు
 
సత్తెనపల్లి,జనవారధి: దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు పట్టణంలోని పలు విద్యాసంస్ధల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
 
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా పట్టణ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు,మాజీ మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ..భారత శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. కలాం నడిచిన బాట, ఆయన పద్ధతులు లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం బోధనలు ఇప్పటికి కూడా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయని కొనియాడారు.
 
 
వైసిపి ఆధ్వర్యంలో..
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా  జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సయ్యద్ మహబూబ్ ఆధ్వర్యంలో
స్ధానిక‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా సాగిన ఆయన జీవన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.వ్యక్తిగత సంపాదన కన్నా దేశ ప్రయోజనాలకే ప్రాధా న్యతనిచ్చిన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  అంబటి మురళి,స్దానిక  నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.
 
 
భవిష్య ఆధ్వర్యంలో..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతిని భవిష్య పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఇమడాబత్తుని శ్రీధర్ మాట్లాడుతూ కలాం మద్య తరగతి కుటుంబంలో పుట్టి పేపర్‌ బారుగా జీవనం సాగిస్తూ దేశంలో అత్యున్నతమైన పదవిని అలంకరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.
 
 
ప్రగతి ఆధ్వర్యంలో..
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వర్ధంతిని స్ధానిక ప్రగతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్ధాపకులు మక్కెన అచ్చెయ్య మాట్లాడుతూ..శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధకునిగా, రచయితగా, అధ్యాపకునిగా, రాష్ట్రపతిగా, మార్గనిర్దేశకునిగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్ధులు తదితరులున్నారు.





POLL