Janavaradhi | Online News


మంద కృష్ణ మాదిగ అరెస్ట్ దారుణం.....


ముప్పాళ్ళ, జనవారధి : ఎస్సీ వర్గీకరణ కోరుతూ చట్టబద్దత పోరాటం చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడం దారుణం అని మండల అధ్యక్షులు గుజ్జర్లపూడి అశోక్ పేర్కొన్నారు. శనివారం  ముప్పాళ్ళ మండలంలో ఎమ్మార్పీఎస్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  " ఉషామెహరా కమేషన్" చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని , గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్న సమ‍యంలో రిజర్వేషన్ కు అనుకూలంగా  లేఖ ఇచ్చి  అసెంబ్లీ సాక్షిగా రిజర్వేషన్ చేయడం సరికాదని వ్యాఖ్యానించడం మాదిగలను మోసం చేయడమేనని ఆయన తెలిపారు. తండ్రి ఆశయ సాధన కోసం పని చేస్తానన్న జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అనేది తండ్రి ఆశయ సాధనమేనని ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.  ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఎమ్ ఆర్ పిఎస్ నాయకులు మరియు మాదిగ ఉపకులాలు , ఎమ్ ఇ పి నాయకులు, ఎమ్ సిఎఫ్ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.  ఈ మాదిగలను మోసం చేస్తే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని గుజ్జర్లపూడి అశోక్ హెచ్చరించారు.   ఈకార్యక్రమంలో  కె. మనోజు, బి. గోవర్ధన్, సిహెచ్. కోటయ్య బి. కోటయ్య, జి. సురేష్, ఏసుపాదం, రమేష్, దేవరాజు నిమ్మయ్య, రుద్రయ్య, పి. నాగేస్వరరావు తదితరులు పాల్గొన్నారు.





POLL