Janavaradhi | Online News


తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు!


తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు.. గోదావరి జిల్లాలు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతుండటంతో.. వానలు పడుతున్నాయి. మరోవైపు ఈ నెల 31 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడుతాయని.. అధికారులు వెల్లడించారు. ఏపీలో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే సీలేరు నదికి వరద నీరు వచ్చి చేరడంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో.. రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి.
 

POLL