Janavaradhi | Online News


బిగ్ బాస్ లో తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ...


నటి హేమ బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చేశారు. మూడో సీజన్‌లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌ హేమ. మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో తొలివారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వెళ్లిన రెండో రోజే రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలను ఎలిమినేషన్‌కు బిగ్ బాస్ నామినేట్ చేశారు. ఐదు రోజులపాటు ఈ ఆరుగురు ఎలిమినేషన్ భయంతో గడిపారు. మొత్తానికి శనివారం మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. నామినేట్ అయిన ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్‌లో వేశారు. హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లోకి వెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది. 
 
హౌజ్‌లో నుంచి హేమ ఎలిమినేట్ అయినా మళ్లీ 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు. ప్రముఖ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను నాగార్జున 15వ కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు. మైక్ అందుకున్న తమన్నా.. తన కల నెరవేరిందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్‌ను అయిన తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. తానేంటో నిరూపించుకుంటానని.. హౌజ్‌లో చివరి వరకు ఉంటానని అన్నారు. బయటికి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అయితే, ప్రస్తుతం తమన్నాను హౌజ్‌లోకి పంపలేదు. బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌజ్‌లోకి వెళ్లాలని, అప్పటి వరకు వేచి చూడాలని తమన్నాకు నాగార్జున చెప్పారు. 

POLL