Janavaradhi | Online News


ప్రాణాల మీదకు తీసుకొచ్చిన టిక్ టాక్ వ్యసనం....


టిక్ టాక్ వ్యసనంతో ఏకంగా అడవిలోకి వెళ్లిపోయాడు ఓ డిగ్రీ విద్యార్థి. జాతీయ జెండా చేతబట్టుకుని కొండగుట్టపై దాన్ని పాతి టిక్ టాక్ వీడియో తీసుకోవాలనుకున్నాడు చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన మురళి. విద్యానికేతన్ డిగ్రీ కాలేజీలో మైక్రోబయాలజీ చదువుతున్న ఈ కుర్రాడు ఒక్కడే సెల్ ఫోన్ తీసుకుని, జెండా చేతబట్టుకుని శేషాచలం అడవుల్లోకి వెళ్లాడు. టిక్ టాక్ చేస్తూ దారి తప్పాడు. అప్పటికే టిక్ టాక్ వీడియో తీసుకున్న మురళి భయంతో తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసి తాను తప్పిపోయానని చెప్పాడు. అతని ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రంతా మురళికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో అన్నంలేక, భయంతో మురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిట్స్ వచ్చి పడిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు లొకేషన్ కి చేరుకోవడంతో బతికి బైటపడ్డాడు. తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి మురళికి చికిత్స అందిస్తున్నారు.





POLL