Janavaradhi | Online News


కిడ్నాపర్‌ రవిశేఖర్‌ అరెస్ట్‌..


వారం రోజుల హైడ్రామాకు తెరపడింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవిశేఖర్ ను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా, ఆమె హైదరాబాద్ చేరుకుని హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే, ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా, ఒంగోలు శివార్లలో రవిశేఖర్ ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం రవిశేఖర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
 

POLL