విజయవాడ: గన్నవరం సమీపంలో తమిళనాడుకు చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పిన్నమనేని సిద్ధార్థ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కానిస్టేబుల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఆత్మకూరు పోలీసులు.. దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
విజయవాడ: కలకలం రేపుతున్న కానిస్టేబుల్ ఆత్మహత్య...




🎬Related Articles
POLL
