Janavaradhi | Online News


ఆతుకూరిపై ఆర్యవైశ్యుల ఆగ్రహం


ఆతుకూరిపై ఆర్యవైశ్యుల ఆగ్రహం
ప్రమాణస్వీకార నిర్వహణపై వివాదం
హోం మినిస్టర్ పేరు చెప్పి లక్షలు వసూళ్ళు..?
తీవ్రంగా ఆరోపించిన ఆర్యవైశ్య నేతలు
 
సత్తెనపల్లి,జనవారధి: ఆతుకూరి ఎక్కడ ఉన్నా ఆరోపణలకు,వివాదాలకు కేంద్ర బిందువుగానే మారుతున్నారు.జిల్లా స్ధాయి పదవులు చేజిక్కించుకుంటున్నా..స్ధానిక సొంత సామాజిక నేతల నుంచి తీవ్ర స్ధాయిలో ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.ఇటీవల బంగారు,వెండి వర్తకుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వచ్చే నెల 4వ తేదిన ప్రమాణస్వీకారానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలో అనూహ్యంగా పట్టణంలోని సొంత సామాజిక వర్గం నేతలే ఆతుకూరిపై వివాదాల అస్త్రాలు సంధించారు.ఆయన వ్యవహార శైలీ,దురుసుతనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేయటం సంచలనంగా మారింది.
 
ప్రకటనలో పేర్కొన్న విధంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఏడాది కాలంగా ఒక్క సమావేశం నిర్వహించలేదని,ఆర్యవైశ్యలు అభివృద్ధికి ఆయన చేసిందేమి లేదని దుయ్యబట్టారు.ఒక్క రూపాయి సొంత డబ్బు వెచ్చించకుండానే హోం మినిస్టర్ వస్తున్నారంటూ సంఘ సభ్యుల నుంచి లక్షలు వసూళ్ళు చేస్తున్నారని ఆర్యవైశ్య సంఘం నేతలు వెలూగూరి శరత్ బాబు,డి.శ్రీనివాసరావు,జెమిలి రాధా కృష్ణమూర్తిలు తీవ్రంగా ఆరోపించారు.వ్యాపారుల మధ్య చీలిక తెచ్చారని,ఒక గదిని అక్రమంగా ఆక్రమించుకున్నారని,పలు జిల్లాల్లో దొంగ బంగారం కేసులు నమోదయి ఉన్నాయని,సత్తెనపల్లి నడి బొడ్డున చర్చి స్ధలాన్ని కొనుగోలు చేయించి అక్రమ లబ్ది పొందాలని ప్రయత్నించిన కేసులో ఆయన రెండవ ముద్ధాయిగా ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.ఆయన దుకాణం,ఇంటికి అద్దెలు చెల్లించకుండా వేదించ‍టం,దివ్యాంగుడైన కిలారి వెంకటేశ్వర్లు షాపు గదిని ఆక్రమించటం వాస్తవం కాదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.
 
ఈ ప్రకటన తెలిపిన వారిలో పొత్తూరి వెంకట దుర్గారావు,ధూపగుంట్ల జానకీ రామారావు,మద్ది వెంకటేశ్వరరావు,అన్నం వెంకట రామారావు,మద్ది అమర్ లు ఉన్నారు.





POLL