Janavaradhi | Online News


సైమాకు ముఖ్య అతిథులుగా చిరంజీవి, మోహన్‌లాల్‌


ప్రతీ సంవత్సరం సౌత్ ఇండియా భాషల్లో రూపొందించిన సినిమాలకు అవార్డులను అందిస్తున్న సైమా ఈ సంవత్సరం ఖతార్ లో ఆ వేడుక నిర్వహించనుంది. దక్షిణాది సినీ పరిశ్రమ వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డులను ఈసారి ఆగస్టు 15న తెలుగు, కన్నడ సినిమాలకు, ఆగస్టు 16న తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డులు అందించనున్నారు. కాగా, ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, మాలీవుడ్‌ నుంచి కంప్లీట్ యాక్టర్‌ మోహన్‌లాల్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని సైమా ప్రతినిథులు అధికారికంగా ప్రకటించారు. 15న చిరు, 16న మోహన్‌లాల్‌లు సైమా వేడుకల్లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. ఖతర్‌లోని దోహలో జరగనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి తారలు తరలివెళ్లనున్నారు.
 

POLL