Janavaradhi | Online News


చదువు ఆపి పనికి పంపిస్తే కంప్లైన్ట్ ఇవ్వండి ... జైలర్ అంజయ్య


దూళిపాళ్ల, జనవారధి : సత్తెనపల్లి మండలంలోని దూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీ లోని మండల పరిషత్ పాథమిక పాఠశాలలో ఫ్రెండ్స్ సోషల్ ఆర్గనైజషన్ ఆధ్వర్యం లో జరిగిన పుస్తకాల పంపిణి కార్యక్రమంలో...  విద్యార్థిని విద్యార్థులకు అద్దేపల్లి రమేష్, నీలం జగదీశ్ , సీతయ్య తులవ కలిసి నోటుబుక్స్ అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన సత్తెనపల్లి సబ్ జైలు  జైలర్ " సురభి అంజయ్య"  మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించాలి అని ,10 తరగతి తరువాత చదువు ఆపి పనికి పంపిస్తుంటే 100 ఫోన్ చేసి పోలీసులకు కంప్లియెంట్ ఇవ్వాలి అని అన్నారు , మీకు ఉద్యోగం వచ్చేదాకా ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండి చదువుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యులు అచ్చయ్య గారు , టీచర్స్ , గ్రామ ప్రజలు, ఫ్రెండ్స్ సోషల్ ఆర్గనైజషన్ అధ్యషులు తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 
 





POLL