Janavaradhi | Online News


రక్త దానంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఐ


 

సత్తెనపల్లి,జనవారధి: రక్త దానం,అవయవదానంపై మేము సైతం అనే స్వచ్ఛంధ సేవా సంస్ధ ఆధ్వర్యంలో పట్టణంలోని తాలుకా సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పట్టణ సిఐ విజయ చంద్ర ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు.అవయవదానం చేయటం వలన మనిషి మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవితాన్ని ప్రసాదించే గొప్ప కార్యక్రమం అవయవదానమని వివరించారు.రక్త దానం,అవయవదానాలపై  రాష్ట్ర వాప్యంగా అవగాహన కల్పిస్తున్న మేము సైతం సంస్ధ సభ్యులను అభినందించారు.

 

మేముసైతం స్టేట్ సెక్రటరీ సిగిరెడ్డి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..రాష్ట్రంలో రక్తం దొరక్క ఏ ఒక్క ప్రాణం పోకూడదు అన్న లక్ష్యంతో ఈ జన జాగృతి యాత్ర కార్యక్రమం చేపట్టి రక్తదాతల వివరాలను memusaithamap.com లో పొందుపరుస్తున్నామని, మూడు సంవత్సరాలలో రాష్ట్రం మొత్తం జన జాగృతి యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.

 

ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులు పాల్గొని ప్రసంగించారు.ముందుగా పట్టణ ప్రధాన రహదారుల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో మేము సైతం  స్వచ్ఛంధ సేవా సంస్ధ సభ్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జి  బత్తుల కేశవ,SFI లీడర్  నరేష్,పలువురు రక్తదాతలు సిబ్బంది పాల్గొన్నారు.





POLL