Janavaradhi | Online News


భవన నిర్మాణ కార్మికల దీక్షకు మద్దతు తెలిపిన ప్రజ్వలన టీం


సత్తెనపల్లి,జనవారధి: ఇసుక సరఫరా చేసి తమకు జీవన భృతి కల్పించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు పట్టణంలోని తాలుకా సెంటర్లో గత రెండు రోజులుగా నిరసన దీక్షకు  ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులు మద్దతు తెలియజేశారు.గురువారం దీక్ష స్ధలాన్ని సందర్శించి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.
 

 
అనంతరం వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ఇసుక  సరఫరా నిలిపివేయడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి విధినపడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.కొత్త ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారనీ ఉపాధి లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాల‌న్నారు. గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న కార్మికులకు నెలకి రూ.10వేలను ఆర్ధిక సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో వారు తీసుకునే నిర్ణయాలకు ప్రజ్వలన సంస్ధ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్ధ సభ్యులు,కార్మికులు తదితరులున్నారు.
 

POLL