Janavaradhi | Online News


సమిష్టి కృషితోనే సంపూర్ణ పారిశుధ్యం సాధ్యం


సత్తెనపల్లి,జనవారధి: అమరావతి సేవా సంస్ధ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో వీధులను శుభ్రం చేశారు.గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సంస్ధ అధ్యక్షులు గొల్లపల్లి వీరాంజనేయులు మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంలో ప్రతి ఒక్కరూ బాద్యతాయుతంగా ఉండలన్నారు.పరిశుభ్రత ద్వారానే మెరుగైన ఆరోగ్య సమాజం లభిస్తుందన్నారు.సంపూర్ణ పారిశుధ్యం ఒక్కరితోనో ఒక్కరోజులోనే సాధ్యమయ్యేది కాదని,నిరంతర కృషితోనే సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్ధ సభ్యులు షారోన్,సాంబ,సుదర్శన్,నాగూర్ తదితరులున్నారు.
 





POLL