Janavaradhi | Online News


అన్నం పరబ్రహ్మ స్వరూపం:మాజీ చైర్మన్ యెల్లినేడి


సత్తెనపల్లి,జనవారధి: అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యటం గొప్ప భాగ్యమని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యెల్లినేడి రామస్వామి అన్నారు. పూజ్యశ్రీ హిమాల‌య గురుదేవులు  సత్తెనపల్లిశాఖ వారి అధ్వర్యంలో శివ గణేష్‌ టెంట్‌ హౌస్‌ వద్ద అన్నదానం జరిగింది. చెరుకూరి వెంటకరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యెల్లినేడి మాట్లాడుతూ ప్రతి గురువారం అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. పేద వర్గాల‌ వారు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రాజుపాలెం యార్డ్‌ మాజీ చైర్మన్‌ వెంకట్‌ కోటయ్య, మస్తాన్‌ వలి,హనుమంతురావు, కంబాల‌ శ్రీనివాసరావు, కంబాల‌ ఆనంద్‌, సూర్య నారాయణ, శ్రీనివాసరావు ,వెంకట్‌ రావు. కొండవీటి శ్రీనివాసరావు, రాఘవరావు, తదితరులు పాల్గొన్నారు.

POLL