Janavaradhi | Online News


ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలి: వైకాపా నేత చల్లంచర్ల‌


సత్తెనపల్లి,జనవారధి: ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైకాపా, ఆర్యవైశ్య సంఘం నేత చల్లంచర్ల‌ సాంబశివరావు అన్నారు. గురువారం పట్టణంలోని సుగాలి కాల‌నీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల‌లో రూ. 6వేల విలువైన ఆటవస్తువుల‌ను ఆయన అందించారు.పాఠశాల‌ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా చల్లంచర్ల‌ సాంబశివరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల‌ను బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చిన దాతల‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో  అచ్యుత శివప్రసాద్‌, దివ్వెల‌ శ్రీనివాసరావు,మద్ది వెంకటేశ్వర రావు, జమిలి రాధాకృష్ణ, పెండ్యాల‌ సందీప్‌ తదితరులు పాల్గొని..వారి చేతుల‌ మీదుగా పంపిణి చేశారు.
 





POLL