Janavaradhi | Online News


అఖిలపక్షం ఆధ్వర్యంలో భిక్షాటన


ఇసుక సరఫరాపై కార్మికుల వినూత్న నిరసన‌
అఖిలపక్షం ఆధ్వర్యంలో భిక్షాటన 
 
 
సత్తెనపల్లి,జనవారధి:గత మూడు నెలలుగా ఇసుక సరఫరా నిలిచిపోవటంతో భవన నిర్మాణ,అనుభంద రంగాలకు చెందిన వందాలాది కార్మికులు రోడ్డున పడ్డారు.ప్రభుత్వ విధానంపై తమ ఆందోళన తెలియజేసేందుకు రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు.శనివారం వినూత్నంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు భిక్షాటన చేస్తూ  వినూత్న నిరసన తెలియజేశారు.కూలీల భాదలను,ఆవేదనను స్ధానికులకు వివరించారు.పని లేక పోవటంతో పస్తులుంటున్న తమ పరిస్ధితిపై ప్రభుత్వానికి తెలియజేప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు అవ్వారు ప్రసాద్ మాట్లాడుతూ.. మూడు నెలలుగా పని లేకపోవటంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు నెలకు పది వేల చొప్పున భృతి మంజూరి చేయాలన్నారు.అన్ని వర్గాలకు ఇసుక అందుబాటులో ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన విధానం సత్వరమే తీసుకురావాలన్నారు.కార్మికుల ఆకలి చావులు చూడకముందే ప్రభుత్వం మేల్కొనాలని ఆయన సూచించారు.
 
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెండ్యాల మహేష్,సిపిఐ నాయకులు నరిశేటి వేణుగోపాల్,టిడిపి నేతలు కోమటినేని శ్రీనివాసరావు,గన్నమనేని శ్రీనివాసరావు,జనసేన నాయకులు కొమ్మిశెట్టి సాంబశివరావు,తవిటి భావన్నారాయణ,ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులు, తదితరులున్నారు.
 

POLL