Janavaradhi | Online News


మున్సిపాలిటీ ఉన్నట్టా.? లేనట్టా?


మున్సిపాలిటీ ఉన్నట్టా.? లేనట్టా? 
త్రాగునీటి పైపుల్లో మురుగు నీరు 
ప్రజల ఆరోగ్యంపై మరీ ఇంత అలసత్వమా..? 
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్దానికులు 
 
సత్తెనపల్లి, జనవారధి: త్రాగేనీరు కేవలం ఎదో మురికివాసన వస్తేనే ఆ నీళ్లను మనం ముట్టుకోము. అలాంటిది మురికి నీళ్ళే త్రాగునీటి పైపుల్లో ప్రవహిస్తే…. ఎం సమాధానం చెప్పాలి. అలాంటిది మన ఇంటిముందు ఇలా మురికినీరు త్రాగునీటి పైపుల్లో ప్రవహిస్తే…? ఖచ్చితంగా త్రాగునీటిపై అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి.ఇంతకీ ఎక్కడో చెప్పనేలేదు కదా స్ధానిక 24వ వార్డ్ లో త్రాగునీరు పచ్చగా,దుర్వాసనతో కూడిన నీటి దృశ్యం పై చిత్రంలో చూడొచ్చు.
 
ప్రజలకు ఎన్ని ఇబ్బందులున్నా అధికారులు మాత్రం అంటీముట్టనట్టు, తెలిసీతెలియనట్టు, చూసీచూడనట్టు వ్యవహరించడాన్ని స్దానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి మురికినీరు తాగితే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు మున్సిపాలిటీ ఉన్నట్టా.? లేనట్టా? అని పలువురు విమర్శలు గుప్పిస్తిన్నారు.
 
 ఇక మున్సిపల్ అధికారుల తీరే వేరు బిల్లులు వసూలు చెయ్యటంలో ఉన్న ఆత్రుత, సమస్యలు స్వీకరించటంలో ఉండదంటున్నారు ఇక్కడి ప్రజలు. అధికారులు పట్టించుకోరు, నాయకులు ఇటువైపు తిరిగిచూడరు…. మరి మా సమస్యలు ఎవరికి విన్నవించుకోవాలని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు సామాన్య ప్రజలు. 
 
ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
 





POLL