Janavaradhi | Online News


మానవత్వం చూపిన మిత్రులు


మానవత్వం చూపిన మిత్రులు
తల్లితండ్రులు లేని చిన్నారులకు ఆర్ధిక సాయం
చిన్నారుల జీవితానికి భరోసా:ఎస్సై
 
సత్తెనపల్లి,జనవారధి:తల్లితండ్రులను కోల్పోయి నిరాశ్రుయులైన‌ ఇద్దరు పిల్లలకు చేయూతనిచ్చి వారికి ఆర్ధిక సాయం అందించి వారి జీవితానికి భరోసా కల్పించటం గొప్ప విషయమని రూరల్ ఎస్సై జి.మౌనిష అన్నారు. మండలంలోని ఫణిదెం గ్రామ నివాసితులైన పిల్లకత్తపు వీరాంజనేయులు,అతని భార్య ఇద్దరూ కొద్ది కాల వ్యవధిలో మృతి చెందటంతో వారి ఇద్దరు పిల్లలు నిరాశ్రుయులయ్యారు.గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధులు మిత్రుడు వీరాంజనేయుల దంపతుల మరణంతో తీవ్రంగా మనస్ధాపం చెందారు.వారి ఇద్దరు పిల్లలకు అండగా ఉండాలని నిశ్చయించుకున్నారు.మిత్రులంతా కలసి రూ.60వేలు పోగుచేసి పిల్లల ఇద్దరి పేర్లతో బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు.
 
ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆ బాండ్ లను రూరల్ ఎస్సై మైనీష ఆధ్వర్యంలో పిల్లల నాయనమ్మకు అందించారు.ఈ సందర్భంగా ఎస్సై మౌనిష మాట్లాడుతూ..పెద్దలు అందించిన సహకారంతో మెరుగైన విద్యనభ్యసించి జీవితంలో స్ధిరపడాలని పిల్లలకు సూచించారు.వారికి ఏ అవసరమొచ్చిన నేనున్నాని ధైర్యం చెప్పారు. మిత్రుని కుటుంబానికి అండగా ఉన్న స్నేహితులను ఆమె అభినందించారు.అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
 
 
 
ఈ కార్యక్రమంలో మస్తాన్ రావు,నిమ్మగడ్డ మహేష్,పల్లపోతుల సాంబశివరావు,పోలిశెట్టి రవి,యర్రగుంట శ్రీధర్,ఫ్రెండ్స్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు తోట ఆంజనేయులు,చంద్రయ్య మాస్టార్,గ్రామస్ధులు తదితరులున్నారు.





POLL