Janavaradhi | Online News


కృష్ణాలో చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ యువనేత.......


విజయవాడ: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా...అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతున్న విషయం మరవకముందే మరో యువనేత పార్టీకి గుడ్ బై చెప్పారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు యువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్థాపం చెందిన దేవినేని నెహ్రూ ఇక టీడీపీలో ఇమడలేకపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ గూటికి చేరుతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే సమీప ప్రత్యర్థి, మంత్రి కొడాలి నాని చేతిలో పరాజయం పాలయ్యారు. పరాజయం పాలైనప్పటికీ తన వానిని వినిపిస్తూనే ఉన్నారు. 





POLL