Janavaradhi | Online News


లోకేష్‌ పేరుతో ఫేక్ ట్వీట్....నారా లోకేష్ ఫైర్!


తన పేరుతో తప్పుడు ట్వీట్లతో తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తాను చేసిన ట్వీట్లను మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా వైసీపీ చిల్లర వ్యవహారమంటూ ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే పరువైనా దక్కుతుందన్నారు. ‘ఇదీ వైకాపా నేతల చిల్లర వ్యవహారం. ఏం చెయ్యాలో తెలియక ఇలా లేనిపోని విషయాలు చెబుతున్నారు. బుగ్గనగారు వారి భజన బృందం ఇలా మాట్లాడతారేమో కానీ నేను కాదు. ఇలా అసత్య ప్రచారం చేసేబదులు, ప్రజలకిచ్చిన హామీలపై పనిచేస్తే పరువైనా దక్కుతుంది’అన్నారు. 
 
మాజీ మంత్రి నారా లోకేష్ ఆర్టికల్ 370ను రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.. కానీ ఆ ట్వీట్‌ను మార్ఫ్ చేశారు. అందులో ‘ఆర్టికల్ 370, 35A రద్దుని స్వాగతిస్తున్నాం.. అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంలో మోదీ గారితో ఈ విషయం గురించి చర్చించారు చంద్రబాబు నాయుడు గారు. కాశ్మీర్ అంశం ఎంతో ప్రధానమైనదో అంత సున్నితమైనది, వీలనైంత త్వరగా చర్య తీసుకోవాలని మోదీ గారికి సూచించారు. ఇన్నేళ్లకైనా మోదీగారు చర్య తీసుకోవడం హర్షణీయం’అన్నట్లు మార్చేశారు. 





POLL