Janavaradhi | Online News


వైసీపీలో ఎమ్మెల్సీ పోరు కొత్త చిచ్చు రగిలిస్తోందా?


మొన్ననే మంత్రి పదవులతో వైసీపీలో అసంతృప్తి జ్వాల రగిలింది. ఇప్పుడు మరో పదవుల పందేరం, మరోసారి ఆశానిరాశల సమరానికి సిద్దమవుతున్న సంకేతం అందుతోంది. ప్రాంతాలవారీగా, సామాజికవర్గాల వారీగా సమతూకం పాటించాలని సీఎం జగన్‌ తపిస్తుండగా, ఆవావహుల సంఖ్య చాంతాండంత ఉండటంతో, అసంతృప్తి రేగే అవకాశముందని ఆలోచిస్తున్నారు వైసీపీ అధినేత. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేడి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా, పెద్దల సభ ఎన్నికలతో మరోసారి గరంగరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాల్లో రెండు వైసీపీవి కాగా, ఒకటి టీడీపీది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నాని ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 
 
దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. విజయనగరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన కోలగట్ల వీరభద్ర స్వామి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాం, చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. దీనితో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అధికార పార్టీ కావడం, రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండటంతో చాలా మంది నేతలు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవలని ఆరాటపడుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ కోసం నేతల తీవ్రంగా పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణకు, తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు జగన్. ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎన్నిక కావలిసి ఉంది. వచ్చే మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మోపిదేవికి సీటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 





POLL