Janavaradhi | Online News


కూతుళ్ళ కాఠిన్యం - బందీగా కన్నతల్లి


కూతుళ్ళ కాఠిన్యం - బందీగా కన్నతల్లి 
10 నెలల గృహ నిర్బంధంలో వృద్ధురాలు 
 
సత్తెనపల్లి,జనవారధి:కంటే కూతుర్నే కనమని చెప్తున్న పెద్దలు,ఆడపిల్లే నయం అప్పుడప్పుడూ వచ్చి పలకరించన్నా.. వెళ్తుంది అని  భావించే తల్లితండ్రులకు ఇలాంటి కూతుళ్లు పగస్ధులకైనా పుట్టకూడదని కోరుకునే పరిస్ధితి ఇదీ. ఐదు పదుల వయస్సు ..వృద్దాప్యం. ఆపై కనికరం లేని కూతుళ్ళ నిరాధారణతో పది నెలల గృహ నిర్బంధం..జీవితమెంత దయనీయం.మనవళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో మంచి నీరు ఇచ్చే దిక్కు కూడా లేక, ప్రశాంతముగా జీవించాల్సిన సమయంలో పలకరించే వారు కూడా లేక బయట ప్రపంచం తెలియకుండా పది నెలల పాటు కనీస అవసరాలు తీర్చే వారు లేక దీనావస్ధలో మతిస్ధిమితం కోల్పోయిన ఓ వృద్ధురాలి దీన గాధ ఇదీ. 
 
పట్టణానికి చెందిన గంధారపు శేషు,విజయ దంపతులు పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో నివాసమున్నారు.2009  లో అనారోగ్య కారణాలతో శేషు మృతి చెందారు.భర్తను కోల్పోయినా గుండె నిబ్బరంతో ఇద్దరు ఆడపిల్లలను పెంచి పోషించింది.2014 లో పెద్ద కూతురికి,అనంతరం చిన్నకూతురికి ఘనంగా పెళ్లిచేసి అత్తారింటికి సాగనంపింది.మగపిల్లలు లేకపోవటం,భర్తను కోల్పోవటం,ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్లి పోవటంతో విజయ ఒంటరిదయ్యింది.ఈ పరిస్ధితుల్లో ఆమె నిరాదరణకు గురై, మానసిక క్షోభను అనుభవించి మతిస్ధిమితం కోల్పోయింది.గుంటూరు వైద్యశాలలో బంధువులు వైద్యం చేయించి కొంతకాలం వరకు కనిపెట్టుకున్నారు.కన్నతల్లి కష్టాల్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూడాల్సిన కూతుళ్లు కాఠిన్య హృదయులయ్యారు.కనీసం అప్పుడప్పుడూ అయినా వచ్చి చూసిపోవాల్సినదిపోయి రావటమే మానేశారు.ఒకరోజు తల్లి వద్దకు వచ్చి ఉన్న కాస్త నగదు,బంగారం తీసుకెళ్లి తల్లిని బయట ప్రపంచం చూడకుండా ఇంటికి తాళాలు వేసి వెళ్లారని స్ధానికులు పేర్కొంటున్నారు.కూతుళ్లు కాఠిన్యంగా ప్రవర్తించారు. 
 
 
 
ఆమె దీనావస్ధ చుసిన కొందరు స్ధానికులు జనవారధికి సమాచారమివ్వటంతో వెలుగులోకి వచ్చింది.ఆదివారం పట్టణ సిఐ విజయ చంద్ర ఆధ్వర్యంలో బాధితురాలిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది.ఆమె మానసిక పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో యూనిఫామ్ లో ఉన్న సిఐని ఎంత దుర్భాషలాడినా అయన ఓర్పుతో వృద్ధురాలిని వైద్యశాలకు తరలించేందుకు విశ్వ ప్రయత్నం చేసారు.ఆమె సహకరించకపోవటంతో ప్రస్తుతానికి నీరు,ఆహారం క్రమం తప్పకుండా అందించేందుకు  ఏర్పాట్లు చేసారు.మానసిక వైద్యులను పిలిపించి వృద్ధురాలికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు కృషి చేస్తామని అయన తెలిపారు.





POLL