Janavaradhi | Online News


370 అధికరణ రద్దు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


జమ్మూ కాశ్మీరులో సాధారణ పరిస్థితులు మెరుగయ్యేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జమ్మూకాశ్మీర్ ‌పరిస్థితి అత్యంత సున్నితమైందని, ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. 370 అధికరణ  రద్దు సమయంలో జమ్మూ కాశ్మీరులో ఆంక్షలు విధించారని సుప్రీంకోర్టులో తెహసీన్ పూనవాల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. జమ్మూ కాశ్మీరులో చోటుచేసుకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకొన్నారు. 





POLL