Janavaradhi | Online News


విశిష్ట పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


 

సత్తెనపల్లి,జనవారధి:విశిష్ట పాఠశాలలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య మనువడు మన్నవ సోడేకర్ హాజరై  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.వావిలాల సేవా సమితి,ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులు ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా సోడేకర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ స్వరాజ్యమని, దీనిని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.పాఠశాల  విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు.విద్యార్థులందరూ స్వాతంత్ర్య సమరయోధులైన మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్,అల్లూరి సీతారామరాజులను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణ , అభివృద్ధి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.

 

 

అనంతరం వావిలాల సేవా సమితి ఆధ్వర్యంలో 50 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభావతి, ఉపాధ్యాయులు తదితరులున్నారు.





POLL