Janavaradhi | Online News


వావిలాల సమితి ఆలోచన అభినందనీయం:ఎమ్మెల్యే అంబటి


మొక్కల పెంపకం మానవ మనుగడకు అవసరం 
వావిలాల సమితి ఆలోచన అభినందనీయం:ఎమ్మెల్యే అంబటి  
 
సత్తెనపల్లి,జనవారధి:మొక్కల పెంపకం మానవ మనుగడకు చాలా అవసరమని, మొక్కలు పెంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వావిలాల సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష మొక్కలు నాటే యజ్ఞం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
 

 
 
ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ.. మన అవసరాలకు చెట్లను నరికితే భావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించలేమన్నారు.మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు.వావిలాల సేవా సమితి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.ముందుగా ప్రముఖ స్వాతంత్ర్య సమారా యోధులు వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
 
వావిలాల సేవా సమితి అధ్యక్షులు మన్నవ సోడేకర్ మాట్లాడుతూ..  ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే యజ్ఞం సంకల్పించామని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పట్టణంలోని విశిష్ట పాఠశాలలో 200 ,కండ్లకుంట గ్రామం,జిల్లా పరిషత్ హైస్కూల్లో 3,000 మొక్కలు నాటామన్నారు.
 

 
నియోజకవర్గంలో గ్రామగ్రామాన మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు,యువత, అన్నివర్గాల  ప్రజలు ఉద్యమంలా పాల్గొని కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
 
 
 

 
కార్యక్రమంలో తహసీల్దార్ రమణ కుమారి,వైసిపి నాయకులు అంబటి మురళి,ఆతుకూరి నాగేశ్వరరావు,చల్లంచర్ల సాంబశివరావు,కొమ్మిశెట్టి సాంబశివరావు,నరిసేటివేణుగోపాల్,ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులు తదితరులున్నారు.





POLL