Janavaradhi | Online News


టీడీపీ ఎమ్మెల్యేకు ఝలక్ ఇచ్చిన వరదబాధితులు


పరామర్శకు వెళ్లిన రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు వరదబాధితులు ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వరద బాధితుల్ని పరామర్శించేందుకు పెనుమూడిపల్లెపాలెం వెళ్లారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ బాధితుల్ని కోరారు. దీనిపై బాధితులు ఘాటుగా స్పందించారు.. ప్రభుత్వం ఏదో కొంత చేస్తోంది.. అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచిన గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊళ్లోకి వచ్చారా అంటూ ప్రశ్నించారు. దీంతో చేసేదేమీలేక ఎమ్మెల్యే అనగాని అక్కడినుంచి వెళ్లిపోయారు.
 

POLL