Janavaradhi | Online News


అర్చకుని పై దౌర్జన్యాన్ని ఖండించిన ఐక్యవేదిక


ఆలయ అర్చనాది విధి నిర్వహణలో ఉన్న అర్చక స్వామి పై పైశాచిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా మని బ్రాహ్మణ ఐక్యవేదిక సత్తెనపల్లి డివిజన్ అధ్యక్షులు శ్రీ కొండ కావూరి మార్కండేయ శర్మ కార్యదర్శి సాధు శివ ప్రసాద్  ఖండించారు. నిన్న కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో అర్చన చేస్తున్న కొండ కావూరి వెంకట సుబ్రహ్మణ్యం అని పూజారిని చిలకలూరిపేట కి చెందిన ఆలయ మాజీ కమిటీ సభ్యుడు గుంటుపల్లి నాగభూషణం మరో ఇద్దరితో కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరచ టమే కాక దుర్భాషలాడటం జరిగింది. 
 
నాకు సరి అయిన మర్యాదలు చేయటం లేదని దాడి చేయటం సరైనది కాదని నీకు మర్యాదలు జరగాలంటే మీ అత్త గారింట్లో చేయించుకోవాలి కానీ ఇక్కడ కాదని దేవాలయంలో అందరూ సమానమేనని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఐక్యవేదిక వ్యవస్థాపకులు వేదాంతం వెంకట హరనాథ్ కోరారు.ఈ సంఘటనపై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అన్నపరెడ్డి రామ కోటి రెడ్డి గారు మరియు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఘటనపై  వెంటనే స్పందించి రక్షణగా నిలిచినందుకు ఐక్యవేదిక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో సభ్యులు మోతె పురుషోత్తమ శర్మ, పెద్దింటి ఫణి కృష్ణ, అంపిరాయిని. రాజశేఖర్, అన్నవరపు మణికంఠ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోనంకి మారుతి, డాక్టర్ కె శ్రీనివాస రావు పాల్గొన్న వారిలో ఉన్నారు.





POLL