Janavaradhi | Online News


ఏఎస్ఐ మన్నయ్యకు ఘన సన్మానం


సత్తనపల్లి,జనవారధి: పట్టణ పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చేవల మన్నయ్యకు ఏఎస్ఐ గా ప్రమోషన్ రావడం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్నయ్యను 
 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాసు ఆధ్వర్యంలో 
ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ విజయ్ చంద్ర, ఎస్సైలు క్రాంతి కిరణ్,శివఆంజనేయులు,ట్రాఫిక్ ఎస్సై ఫ్రాన్సిస్,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
 
సందర్భంగా వారు మాట్లాడుతూ..విధి నిర్వహణలో మన్నయ్య ఎంతో అంకితభావంతో పని చేశారని,ఆయన సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఏఎస్ఐ గా ప్రమోషన్ ఇవ్వడాన్ని వారు అభినందించారు.అనంతరం పూలమాలలతో, శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు.





POLL