Janavaradhi | Online News


అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు


అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు 
తక్షణమే స్పందిస్తున్న tpo అధికారులు 
పలు అక్రమ నిర్మాణాల కూల్చివేత 
 
సత్తెనపల్లి, జనవారధి: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురు
అరుణ కుమారి హాస్పిటల్ వద్ద మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి  అక్రమంగా నిర్మాణం చేపడుతున్న విషయాన్ని గమనించిన అధికారులు తక్షణమే స్పందించి ఆ యొక్క అక్రమ నిర్మాణాన్ని నిలిపివేశారు.
 
అదేవిధంగా క్రోసూరు రోడ్డులోని శివాలయం ఎదురు నిర్మిస్తున్న  భారీ శివుని విగ్రహా నిర్మాణ పనులు కూడా అనుమతులు లేవని చెప్పేసి పూర్తిస్థాయిలో పనులు అడ్డుకున్నారు.నిర్మాణాలను కూల్చివేశారు.ఈ నేపథ్యంలో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయటం, మరొక ప్రాంతంలో పనులు నిలిపి వేయడంపై స్థానికులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.పాత బస్టాండ్ వద్ద చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నిస్తున్నారు.
 
ఈ విమర్శలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు స్పందించారు.
వాస్తవానికి గతంలోనే ఆ ప్రదేశంలో మునిసిపాలిటీ అధికారులు ఎటువంటి ఆక్రమణకు గురికాకుండా   ఇనుప గొలుసులతో నిర్మాణం చేపట్టి చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగలేదని కేవలం ప్రయత్నం మాత్రం జరిగిందని దానికి మొదటిలోనే స్పందించి చర్యలు తీసుకున్నామని వారు వివరిస్తున్నారు.అలాగే భవిష్యత్తులో ఎవరు కూడా అక్రమ నిర్మాణం చేపట్టకుండా ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆ ప్రాంతంలో మొక్కలను నాటేందుకు మునిసిపాలిటీ అధికారులు ఈరోజు శ్రీకారం చుట్టారు.
 
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.





POLL