Janavaradhi | Online News


ప్లాస్టిక్ నివారణకు అందరు సహకరించాలి:ఎస్సై శ్రీహరి


ప్రజ్వలన సేవ సంస్ధ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ  
తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత 
 
ఫిరంగిపురం,జనవారధి: స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నివారించేందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై శ్రీహరి అన్నారు. శనివారం ప్రజ్వలన సేవా సంస్ధ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన ''ప్లాస్టిక్ ను నిర్ములిద్దాం-పర్యావరణనాన్ని కాపాడుకుందాం'' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఎస్సై మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
 

 
 
ప్రధాన రహదారి కూడళ్ల వద్ద ప్రజ్వలన సభ్యులు మాట్లాడుతూ..  ప్లాస్టిక్‌ గ్లాసులు, సీసాలు, సంచుల వాడకం వలన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయని,ప్లాస్టిక్‌కు బదులుగా ప్రతి ఒక్కరూ పేపర్‌, గుడ్డ సంచులను వాడాలని సూచించారు.ప్లాస్టిక్ వస్తువులను,కవర్లను వినియోగిచవద్దని వ్యాపారులకు,ప్రజలకు విజ్ఞప్తి చేసారు.తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రారంభమై మార్కింగ్ స్టార్ కళాశాల వరకు ప్లాస్టిక్‌ నివారణపై  అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
 
అనంతరం మండల తహసీల్దార్,ఎండివో,పంచాయితీ అధికారులకు ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజ్వలన సేవా సంస్ధ సభ్యులతో పాటు  మార్నింగ్ స్టార్,సెయింట్ పాల్స్ కళాశాల విద్యార్థులు తదితరులున్నారు.





POLL