Janavaradhi | Online News


లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణి


 
సత్తెనపల్లి,జనవారధి: పర్యావరణ పరిరక్షణ కోసం రాబోయే వినాయక చవితి రోజున పట్టణ లయన్స్ క్లబ్,విజయ గణపతి ఉత్సవ కమిటీ  ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణి చేయబోతున్నట్టు అధ్యక్షులు కంకణాల విష్ణువర్ధనరావు పేర్కొన్నారు.
 

 
 
శనివారం జరిగిన సమావేశంలో క్లబ్ ట్రెజరర్ కొప్పురావూరి రాజా,ఇమ్మిడిశెట్టి జగన్మోహనరావులు మాట్లాడుతూ..సెప్టెంబర్ 2 వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని గోళ్లమూడి వారి వీధి శివ పార్వతి జ్యుయలర్స్,గుండెపూడి వారి వీధిలోని గణేష్ మండపం వద్ద  ఉదయం 7గంటల నుండి మట్టి గణపతి ప్రతిమలను,పూజ పుస్తకాలను ఉచితంగా పంపిణి చేస్తామన్నారు.పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మట్టి గణపతిని పూజించాలని,పర్యావరణనాన్ని కాపాడాలని వారు ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో గ్రంథిసిల శ్రీనివాసరావు,కొప్పురావూరి గురుప్రసాద్,రామకోటయ్య,సిహెచ్।కళ్యాణ్,చండపాటి కోటేశ్వరావు తదితరులున్నారు.





POLL