Janavaradhi | Online News


క్లర్క్ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగింపు


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) క్లర్కు పోస్టుల భ‌ర్తీకి 'కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ) ఎగ్జామినేషన్-IX' దరఖాస్తు గడువు బుధవారం (అక్టోబరు 9)తో ముగియనుంది. ఫీజు చెల్లింపు గడువు కూడా అక్టోబరు 9తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ద‌ర‌ఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు ద‌ర‌ఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. మొదటి విడత (ప్రిలిమినరీ) ఆన్‌లైన్ రాతపరీక్షలను డిసెంబ‌రులో, రెండో విడత (మెయిన్) రాతపరీక్షలను 2019 జనవరిలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారే.. మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు.





POLL