Janavaradhi | Online News


ఉల్లి ధరలు తగ్గేలా కేంద్రం చర్యలు


ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి రూ.80 వరకు చేరింది.దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పెరిగిన ఉల్లి ధరలు ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేలా చూడటం కోసం ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తం అవుతోంది.





POLL