Janavaradhi | Online News


రవిప్రకాష్ పై విజయసాయి ఉచ్చు బిగిస్తున్నారా.?


అవినీతి రహిత - మెరుగైన సమాజం ముసుగులో tv9 పేరు తో రవిప్రకాష్ - మూర్తి - క్లిఫర్డ్ పెరారీ ల 18 కోట్ల దోపిడి అధారాలతో సహా అడ్డంగా దొరికి పోయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీ గా చంచల్ గూడ జైల్లో వున్నాడు రవిప్రకాష్. అయుతే ఇప్పుడు ఆయన మెడ చుట్టూ ఈడి - సీబిఐ - మనీ లాండరింగ్ - బ్లాక్ మెయిలింగ్ కేసులు కూడా చుట్టుకోనున్నాయా అంటే  అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.
 
ఇప్పటికే రవిప్రకాష్ పై 420 - 418 - 409 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా Tv9  బహిష్కృత CEO  రవిప్రకాష్ పై ఆస్తులపై  EDవిచారణ - రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాసిన లెటర్ ఇప్పుడు మీడియా తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఫెమా - ఆర్బీఐ రెగ్యులేషన్ - మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్  ఎగ్గొట్టడం ద్వారా రిమాండ్ లో వున్న రవిప్రకాష్ అక్రమాస్తులు కూడగట్టాడంటూ విజయ సాయి రెడ్డి పేల్చిన బాంబు పై ఇప్పుడు ఆధారాలు వేగంగా సేకరిస్తున్నారు.





POLL