Janavaradhi | Online News


ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్ ఫేక్


దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి,యాంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి పోస్టర్ దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ `రామ రౌద్ర రుషితం` అంటూ టైటిల్ లోగోని విడుదల చేయటం సోషల్ మీడియాలో హల చల్ చేయటం అందరికి తెలిసిందే. ఇది నిజంగా రాజమౌళి సినిమా టైటిల్ అవునా కాదా అంటూ అంతా సందేహం వ్యక్తం చేశారు.
 
కూల్ గా ఆలోచిస్తే అది జక్కన్న టీమ్ పంపించిన అధికారిక టైటిల్ కానే కాదని అర్థమైంది.
అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే. టైటిల్ ఇదే ఫైనల్ కాదని తెలిసింది. ఆర్.ఆర్.ఆర్. చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పనిలోనే రాజమౌళి బిజీ. మరి టైటిల్ ని అధికారికంగా ఎప్పటికి ప్రకటిస్తారు అన్నది చూడాలి.
 





POLL