Janavaradhi | Online News


తిడితే పట్టించుకుంటానా?


అందాల భామ  సోనాక్షి సిన్హా  ఓ రియాలిటీ షో జూరీలో జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలోనే తొలి డిజిటల్ షో.. ఈ వేదికగా తనపై వచ్చే ట్రోల్స్ గురించి సోనాక్షి స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఓ సందేశం ఇచ్చిందట. ``నన్ను అనుసరించే వాళ్లు .. నా బరువు గురించి తిట్టే వాళ్లు అందరికీ ఒకటే చెబుతున్నా. నేను ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ట్రోల్ చేసిన వారి కంటే మంచి స్థాయిలోనే ఉన్నాను`` అని తెలిపింది. నన్ను మించిన గొప్పవాళ్లు నన్ను తిడితే తప్పేమీ లేదు కానీ `తక్కువ స్థాయి వాళ్లు!!` తిడితే పట్టించుకుంటానా? అంటూ లైట్ తీస్కుందట.





POLL