Janavaradhi | Online News


ప్రజలకు సేవ చేసేందుకే పోలీస్ శాఖ: సిఐ విజయచంద్ర


 
సత్తెనపల్లిలో చడ్డీగ్యాంగ్..?
ప్రతి పౌరుడూ పోలీస్ లా ఫీలవ్వాలి 
ప్రజలకు సేవ చేసేందుకే పోలీస్ శాఖ
- పట్టణ సిఐ విజయచంద్ర
 
సత్తెనపల్లి,జనవారధి:గత కొద్దీ రోజుల క్రితం వినుకొండలో కలకలం సృష్టించిన చడ్డీగ్యాంగ్ జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించింది.జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఈ గ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారం రావటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించటంతో ఆందోళన మరింత ఎక్కువైంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని సత్తెనపల్లి పట్టాన,పరిసరాల్లో చడ్డీగ్యాంగ్ తిరుగుతుందంటూ పుకార్లు పెద్ద ఎత్తున హల చల్ చేస్తున్నాయి.నిజంగా సత్తెనపల్లిలో చడ్డీగ్యాంగ్ తిరుగుతుందా..?సత్తెనపల్లిలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయి..?నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?గుట్కా,నకిలీ సిగరెట్లు అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారా..? లాంటి ప్రశ్నలకు సత్తెనపల్లి పట్టణ సిఐ విజయచంద్ర మాటల్లోనే తెలుసుకుందాం.
 

 
జిల్లాలో చడ్డీగ్యాంగ్ తిరుగుందన్న సమాచారం నిజమే.వినుకొండలో జరిగిన సంఘటనపై పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది.ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఈ గ్యాంగ్ ఉన్నట్టు సమాచారం.సత్తెనపల్లిలో చడ్డీగ్యాంగ్ఎ గురించి ఏటువంటి కదలికలు లేవు.అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అపార్ట్ మెంట్ లలో,శివారు ప్రాంతాల్లో  నివసించే ప్రజలు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.కుక్కలను పెంచుకోవాలి.సెక్యూరిటీని నియమించుకోవాలి.పోలీసులకు సహకరించాలి.ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారమివ్వండి.ఆ ఇళ్లకు భద్రతా కల్పిస్తాం. సెల్ ఫోన్,బైక్ దొంగతనాల విషయంలో పోలీస్ శాఖ 24 గంటలు సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టాం.ప్రధాన రహదారుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.గుట్కా,నకిలీ సిగరెట్లు అమ్మకాలపై నిఘా పెట్టాం.వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీస్ లా ఫీలయ్యి ఎలాంటి అపోహలు లేకుండా,నిర్భయంగా  పోలీసులకు సమాచారాన్ని చేరవెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
 - పట్టణ సిఐ విజయచంద్ర 
 
 





POLL