Janavaradhi | Online News


ప్రజ్వలన ఆధ్వర్యంలో 1000 జూట్ సంచుల పంపిణి


ఆవిష్కరించిన కమిషనర్,తహసీల్దార్,పట్టణ సిఐ 
 
సత్తెనపల్లి,జనవారధి: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లకు ప్రత్యామ్నాయంగా గుడ్డ, జూట్తో చేసిన సంచులను వినియోగించాలని తహసీల్దార్ రమణ కుమారి,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు,పట్టణ సిఐ విజయచంద్ర పిలుపునిచ్చారు.మంగళవారం స్ధానిక ప్రజ్వలన బృందం ఆధ్వర్యంలో 1000 జూట్ సంచులను ఉచితంగా పంపిణి చేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ నివారణ చర్యలు ముందుగా మన ఇంటి నుండే ప్రారంభం కావాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.దీనికి ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని, ప్రకృతితో మమేకమై అందరూ ఆహ్లాదకర వాతావరణంలో జీవించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.ప్రజల్లో అవగాహనా కల్పిస్తూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్న ప్రజ్వలన బృందాన్ని అభినందించారు.
 
అనంతరం వైసిపి నాయకులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లంచర్ల సాంబశివరావు,ఆ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అచ్యుత శివప్రసాద్,తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు చౌట శ్రీనివాసరావు,ఆర్జీఎన్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ పరిటాల నరేష్ లు జూట్ సంచులను పంపిణి చేసారు.వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణ అందరి బాధ్యతని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవతి సుబ్బారావు,రావిక్రింది మల్లిఖార్జునరావు,జింకా లోకేశ్వరరావు తదితరులున్నారు.
 





POLL