Janavaradhi | Online News


సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి


సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి 
నూతన ఎస్సై సురేష్ చొరవ చూపాలి 
భద్రత కట్టుదిట్టం చేయాలి 
 
ఫిరంగిపురం,జనవారధి:మండల కేంద్రమైన ఫిరంగిపురం ప్రధాన రహదారిపై నేరాలు నియంత్రించటానికి   పోలీస్ శాఖ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలనీ స్ధానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించటానికి, నేరాల నియంత్రణకు, నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమరాలు ఎంతో ఉపయోగపడతాయని, సిసి కెమెరాల ఏర్పాటుకు నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్సై సురేష్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.నిఘా కెమెరాలు ఉంటె నేరాలు చేసేందుకు భయపడతారని,దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగిన కేసులను వేగంగా ఛేదించేందుకు ఇటువంటి నిఘా కెమెరాలు ఉపయోగపడయని సూచిస్తున్నారు.మండల ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని వాటిని ఇప్పటికైనా పోలీసులు నాణ్యమైన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే మంచిదని భావిస్తున్నారు.





POLL